Babu Mohan : ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో ఆ కల కొంతవరకు నెరవేరింది.
Read Also : SSMB 29 : పాసులుంటేనే రండి.. మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్
అందుకే ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అలవాటు అయింది. సినిమాలో హీరోలా స్పీడ్‌గా బైక్ లు నడపకండి. నా కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్ లో బైక్ కొనుకుని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో నడుపుతుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఎంతో మందిని నవ్వించిన నేను… నా కొడుకు గురించి ఆలోచన వచ్చే ప్రతీసారి కన్నీళ్లు ఆగవు. ఆ బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది. కోట శ్రీనివాసరావు గారి కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. మేమిద్దరం ప్రతి సారి కలిసినప్పుడు మా పిల్లల గురించి మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవాళ్లం అని బాబు మోహన్ ఏడ్చేశారు.
Read Also : Benefits of Raspberries: రాస్ బెర్రీస్ తింటే గుండెకు ఎంత మంచిదో తెలుసా..
