Site icon NTV Telugu

Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..

Baahubali

Baahubali

Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది.

Read Also : Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?

బాహుబలి-2లో దేవసేన సీమంతం వేడుక షూటింగ్ లో ప్రభాస్, రానా, అనుష్క మధ్య జరిగిన సంభాషణ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ అల్లరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దేని గురించో తెగ మాట్లాడేస్తున్నాడు. అటు రానాతో ఆ తర్వాత అనుష్కతో ఏదో సరదాగా చెబుతున్నాడు. అక్కడున్న వారంతా ప్రభాస్ చెబుతున్న దానికి నవ్వేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Read Also : Madan Babu : విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Exit mobile version