Site icon NTV Telugu

Baahubali : బాహుబలిని ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?

Baahubali

Baahubali

Baahubali : తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ.. అప్పటి వరకు సౌత్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కు ముచ్చెమటలు పట్టించిన మూవీ.. అదే బాహుబలి. ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి బాహుబలి మాత్రమే తెలిసేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఈ ఎవర్ గ్రీన్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానిపై నేడు జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీని అక్టోబర్ 31 2025 రోజున రీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను బాహుబలి ద ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పెద్ద సంస్థలే రంగంలోకి దిగుతున్నాయి.

Read Also : Nayanthara : నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!

నైజాంలో ఏసియన్ సురేష్‌ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారాహి సంస్థ, నార్త్ ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో AAFilmsIndia వాల్లు రిలీజ్ చేస్తున్నారు. అటు నార్త్ అమెరికాలో DylanMarchetti సంస్థ, వారాహి సంస్థ, ఫ్రాన్స్ లో carlottafilms, జపాన్ లో movietwin2 సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. జపాన్ రిలీజ్ డేట్ ను సెపరేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఒక కొత్త సినిమా రిలీజ్ చేస్తే ఏ స్థాయి పోటీ ఉంటుందో బాహుబలి రీ రిలీజ్ కు కూడా అలాంటి పోటీ నడుస్తోంది. ఎంతైనా ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఆ మాత్రం ఉంటుంది మరి. రిలీజ్ అయినప్పుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో.. రీరిలీజ్ లో కూడా అదే స్థాయి రికార్డులు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Read Also : Udayabhanu : యాంకరింగ్ లో సిండికేట్ ఎదిగింది.. ఉదయభాను సంచలనం..

Exit mobile version