Baahubali Epic : బాహుబలి.. అదో అద్భుత ప్రపంచం. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా దాని ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక చోట బాహుబలి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ దుమ్ములేపుతోంది. టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ లైఫ్ టైమ్ కలెక్షన్లను బాహుబలి ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దాటేస్తోంది. దీన్ని బట్టి ఈ మూవీ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై శింబు షాకింగ్ కామెంట్స్
రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంతో పాటు.. కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయని మూవీ టీమ్ చెప్పడంతో ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రెండు పార్టులు కలిస్తే ఎలా ఉంటుందో.. పైగా ఆ సర్ ప్రైజ్ ను కచ్చితంగా చూడాలనే ఆత్రంతోనే అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆరాటంతో ఉన్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో అనే అంచనాలు పెరుగుతున్నాయి.
Read Also : Dulkar Salman : దుల్కర్ సల్మాన్ కు భారీ ఊరట
