గౌరవంగా, కించిత్ గర్వంగా ఉంది– డైలాగ్ కింగ్ సాయికుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్ర మోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15వరకు 75వారాలపాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంతమందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు పద్మశ్రీ దాలవాయి చలపతిరావు, నటుడు సాయికుమార్, గాయని షణ్ముఖప్రియను సన్మానించారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహితల్లో ఒకరైన సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘ సంస్కారం అమ్మది, స్వరం నాన్నది, అనుగ్రహం కళామతల్లిది, అభిమానం మీ అందరిది. నేను రీల్ హీరో అయితే నన్ను అభిమానించే అభిమానులే రియల్ హీరోలు. భారతీయులుగా పుట్టడం మనందరి అదృష్టం. ఈ వేదికపై సన్మానించిన చలపతిరావుగారు పదో ఏట, సింగర్ షణ్ముణప్రియ ఐదో ఏట, నా నట ప్రయాణం పదకొండో ఏట ప్రారంభమవ్వటం ఈ వేడుకలో యాధృశ్చికంగా జరిగి ఉండొచ్చు. నా ముందుతరానికి చెందిన చలపతిరావు గారిని, నా తర్వాత తరం షణ్ముణను అలాగే నా తరానికి ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసి ఇంత గొప్ప సభలో సన్మానించటాన్ని గౌరవంగా, కించిత్ గర్వంగా భావిస్తున్నా. ఇంతటి గొప్ప కార్యక్రమానికి కారణమైన తెలుగు రాష్ట్రాల ఐటీ డిపార్ట్‌మెంట్ వారికి వారి చీఫ్ కమీషనర్ శ్రీయుతులు అతుల్ ప్రణయ్ గారికి కృతజ్ఞతలు’’ అన్నారు.
Also Read
- Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?