Ayalaan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్. సైన్స్ ఫిక్షన్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయల అయలా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఒక గ్రహం నుంచి ఏలియన్ కిందకు వచ్చి.. హీరో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దాంతో హీరోవాళ్ళు చేసిన విన్యాసాలే ఈ సాంగ్ లో చూపించారు.
ఇక సరస్వతి పుత్ర రామజోగయ్య అందించిన లిరిక్స్ భలే గమ్మత్తుగా ఉండగా.. ఇంకాగా గమ్మత్తుగా తనదైన స్వరంతో ఆలపించి మెస్మరైజ్ చేశాడు సింగర్ అనురాగ్ కులకర్ణి, సంజిత్ హెగ్డే. ఇక వీడియోలో అయలాన్ తో శివ కార్తికేయన్ డ్యాన్స్ ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు శివకార్తికేయన్. ఇప్పటివరకు కోలీవుడ్ లో ఏలియన్ కథ వచ్చిందే లేదు. మొదటిగా శివకార్తికేయన్ ఈ ప్రయోగాన్ని చేస్తున్నాడు. అన్ని భాషల్లో ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. మరి మిగతా సినిమాలతో పోటీ పడి అయలాన్ హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.