Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Avs Son Movie Bhala Chora Bhala

Comedy entertainer: ఏవీయస్ తనయుడి ‘భళా చోర భళా’!

Published Date :August 13, 2022 , 4:47 pm
By Omprakash Vaddi
Comedy entertainer: ఏవీయస్ తనయుడి ‘భళా చోర భళా’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ప్రముఖ నటుడు, దర్శకుడు స్వర్గీయ ఏవీయస్ తనయుడు ప్రదీప్ సైతం తండ్రి బాటలోనే సాగుతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ఎ. ప్రదీప్ ఇప్పుడు దర్శకుడిగానూ మారాడు. ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రధారులుగా ప్రదీప్ ‘భళా చోర భళా’ అనే సినిమాను తెరకెక్కించారు. యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ను ఎ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో నటుడు ఆలీ సోదరుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ, ”ఇది కంప్లీట్ నెపోటీజమ్ మూవీ అనొచ్చు! ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం. ప్రదీప్ నాకు ఏవీఎస్‌గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ స్నేహంతోనే ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకున్నాం. కోవిడ్ టైం లోనే ప్రదీప్ నాకు స్టోరీ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చింది. కథ నచ్చిన రెండో రోజే షూటింగ్ అన్నాడు. 9 డేస్‌, 8 నైట్స్ లో షూట్ కంప్లీట్ చేసి, రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పూర్తి చేసి రిలీజ్‌కి సిద్ధం చేశాడు. ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ‘అవును’ ఫేమ్ చంటి తాను ఇందులో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయదని చంటి హామీ ఇస్తున్నాడు. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ, ”లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ డేస్‌లో మంచి సినిమా చేయాలని ప్లాన్ చేశాను. అదే ‘భళా చోర భళా’గా మీ ముందుకు రాబోతోంది. మా నాన్న ఏవీయస్ గారిపై ఉన్న అభిమానంతో సినిమా వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాను ఆగస్ట్ 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A. Pradeep
  • Bhala Chora Bhala
  • Chintu
  • Khayyum Ali
  • Naveen Neni

తాజావార్తలు

  • Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

  • Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..

  • Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • Carmeni Selvam: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే ‘కార్మేని సెల్వం’

  • Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions