Avika Gor : యంగ్ హీరోయిన్ అవికా గోర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అవికాగోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాగా పాపులర్ అయింది. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి వచ్చి మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత సినిమా చూపిస్త మావా సినిమాలతో పాటు చాలానే చేసింది. ఆమె చేసిన వాటిల్లో ఎక్కువగా హిట్లే ఉన్నాయి. అయినా సరే సౌత్ లో ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీతో ప్రేమలో పడింది. నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ జూన్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
Read Also : The Raja Saab Trailer : ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్
సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే అవికాగోర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలు పెట్టారు. తాజాగా మెహందీ వేడుక నిర్వహించారు. అవికా, మిలింద్ మెహందీ పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. రేపు ఉదయం వీరి పెళ్లి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అందమైన జంట తమ సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నారు. అవికా ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Dhana Sri : చాహల్ మోసం చేశాడు.. ధనశ్రీ షాకింగ్ కామెంట్స్