Avika Gor: పదో తరగతి అనుభవాలతో ‘టెన్త్ క్లాస్ డైరీస్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రాల తర్వాత నటుడు, నిర్మాత అచ్యుత రామారావు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
- Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
- Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ “డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా… వాళ్ళందరి జీవితాల్లో టెన్త్ క్లాస్ మెమరీ అనేది మైల్ స్టోన్ లాంటిది. ఆ అనుభవాలు మిగతా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్టనర్ లాంటిది. ఆ మెమరీస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కొంత మంది జీవితాల్లోజరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను రూపొందించాం. పదోతరగతి చదివిన ప్రతి ఒక్కరినీ ఆ రోజులలోకి తీసుకు వెళుతుంది. దర్శకుడు ‘గరుడవేగ’ అంజి వాణిజ్య హంగులతో వినోదాత్మకంగా తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని నైజాం లో ఏషియన్ సునీల్ కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది’’ అని అన్నారు. ‘సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్ పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, ‘కుర్రవాడా కుర్రవాడా…’ పాటలకు, ప్రత్యేక గీతం ‘సిలకా సిలకా’కు మంచి స్పందన లభించిందని దర్శకుడు ‘గరుడవేగ’ అంజి తెలిపారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Nandamuri Mokshagna : వశిష్ఠ డైరెక్షన్లో నందమూరి సింబా మోక్షజ్ఞ సినిమా ఫిక్స్?
-
Rohit Sharma-Team India: అగార్కర్‌తో విభేదాలు.. గంభీర్‌పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
ట్రెండింగ్
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!