Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఇది! ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ఇండియన్ ఫ్యాన్స్ చేసిన డిమాండ్ ఎట్టకేలకు ఫలించింది. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ #OpenDoomsdayBookings అనే ట్రెండ్‌తో హోరెత్తించిన అభిమానుల దెబ్బకు మార్వెల్ సంస్థ ఏకంగా బుకింగ్స్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇండియన్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే అత్యంత సెన్సేషనల్ విషయం ఒకటుంది. అదేంటంటే.. హాలీవుడ్ ఖిల్లా అయిన అమెరికా ప్రేక్షకుల కంటే ఒకరోజు ముందుగానే ఈ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ మహా యుద్ధం భారతీయ థియేటర్లలోకి రాబోతోంది!
డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా, ఇండియన్ ప్రేక్షకులకు మాత్రం ఆ కిక్ ఒకరోజు ముందే దక్కనుంది. మార్వెల్ స్టూడియోస్ భారతీయ మార్కెట్‌కు, ఇక్కడి ఫ్యాన్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు. బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి వంటి నగరాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం ఆన్లైన్లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. అసలు ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే.. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, కేవలం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1200 కోట్లకు పైగా) కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగేలా చేసింది. ఇకపోతే, సినిమాకు సంబంధించి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 503 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి, ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో ట్రైలర్‌గా రికార్డుల మోత మోగించింది.
సూపర్ హీరోల మధ్య జరగబోయే ఈ భీకర పోరాటాన్ని మార్వెల్ స్టూడియోస్ ఇన్ఫినిటీ విజన్‌తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలో చూసేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ విజువల్ ట్రీట్‌ను మీరూ తొలిరోజే ఎంజాయ్ చేయాలంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో మీ సీటును రిజర్వ్ చేసుకోండి!
Also Read
- Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
- Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
- Dhanush : 'పొగరు' అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
తాజావార్తలు
-
Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు!
-
Rudransh Thakur: స్కూటర్ ముందు నిలబడి ఓ లుక్కిచ్చాడు అంతే.. బుడ్డోడి స్వాగ్కి నెటిజన్లు ఫిదా..
-
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
-
Rachin Ravindra: టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయాం.. టెస్టులో అలా ఉండదు.. భారత్‌ను దెబ్బ కొడతాం..
-
Airport Security: ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు.. వారి స్థానంలో..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..