మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ఫుల్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే తన “రౌడీ” బ్రాండ్ తో బట్టలు అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇంకా తన బిజినెస్ ను విస్తరించుకోవడానికి తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు.
Read Also : చెప్పులేసుకుని ఫోటో దిగినందుకు నటి అరెస్ట్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ స్టార్ హీరో ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్ నగర్లో ఒక మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరిస్తున్నారు. మల్టీప్లెక్స్ పేరు ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD సినిమాస్). మల్టీప్లెక్స్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మల్టిప్లెక్స్ కు సంబంధించితిన్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. AVD సినిమాస్ ఓపెనింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. AVD సినిమాస్ లో ఈ ఏడాది దసరా నుండి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇక మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ వారితో కలిసి “ఏఎంబి” (ఏషియన్ మహేష్ బాబు) అనే మల్టిప్లెక్స్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “లైగర్” అనే స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?