చెప్పులేసుకుని ఫోటో దిగినందుకు నటి అరెస్ట్

మలయాళ టీవీ సీరియల్ నటి నిమిషా చెప్పులేసుకుని ఫోటో తీసుకోవడం అరెస్ట్ కు దారి తీసింది. అయితే చెప్పులేసుకుని ఫోటోలు దిగితే తప్పేంటట ? అని అడగకండి. అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆమెకు అక్షింతలు వేయకుండా ఉండరు. ఆమె చెప్పలేసుకుని ఏకంగా ఓ దేవుడి ఉత్సవ పడవలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగిందన్న మాట. దేవాలయ ఆచారాలను ఉల్లంఘించింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బ్యూటీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిమిషాను అరెస్టు చేసి, ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు తెలియజేశారు. నిమిషాతో పాటు ఆమె ఫోటోలు తీసిన స్నేహితుడి స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.

నిమిషా కొంతమంది స్నేహితులతో కలిసి ప్రసిద్ధ ఆరన్ముల దేవాలయంలోని పల్లియోదంలోకి వెళ్ళింది. అదే సమయంలో అతను అక్కడ ఉన్న దేవుడి ఉత్సవ పడవలో ఫోటోలు తీసుకున్నారు. అది కూడా చెప్పులు వేసుకుని. ఆమె ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. నెటిజన్లు, హిందూవాదులు ఆమెపై ఫైర్ అవ్వడంతో ఆ ఫోటోలను ఆమె డిలీట్ చేసింది.

Read Also : గర్ల్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన షణ్ముఖ్

అయితే విషయం ఇక్కడితో ఆగలేదు. పుతుకులంగర పల్లియోడం సేవా సమితి ఆలయ నియమాలను ఉల్లంఘించినందుకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు తిరువళ్ల పోలీస్ స్టేషన్‌లో నిమిషాపై ఫిర్యాదు నమోదు చేసింది. ఈ విషయం మరింత కావడం, బెదిరింపులు ఎదురవడంతో నిమిషా కూడా తనను బెదిరించిన వారిపై ఫిర్యాదు నమోదు చేసింది. అంతేకాదు తాను పొరపాటు చేశానని ఒప్పుకుంది. నాకు ఆ పడవలోకి ఎక్కడం తప్పు అనే విషయం తెలియదు. అది తెలియగానే ఫోటోలను డిలీట్ చేశానని, అయినప్పటికీ తనకు, తన కుటుంబానికి తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పింది.

పంపా నదిలో సాంప్రదాయ పద్ధతిలో దేవుడి ఊరేగింపును నిర్వహించడానికి ప్రసిద్ధ ఆరన్ముల ఆలయంలో పల్లియోదం లేదా పాము పడవలను ఉపయోగించడం ఆచారం. ఇక చెప్పులు ధరించితిన్ ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-