Site icon NTV Telugu

Avatar 2 : విడుదలకు ముందే యూనిక్ రికార్డు

Avatar-2

“అవతార్” ద్వారా సినీ ప్రియులకు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ తన మాగ్నమ్ ఓపస్‌కి సీక్వెల్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. సరికొత్త సాంకేతికతతో వరుస పెట్టి సీక్వెల్స్ ను రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. “అవతార్ 2” డిసెంబర్ 16న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ విడుదలకు ముందే అరుదైన రికార్డును క్రియేట్ చేయడం విశేషం.

Read Also : Ram Charan : ఇంద్రకీలాద్రిపై హద్దులు దాటిన మెగా అభిమానం… వీడియో వైరల్

“అవతార్-2” ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఇదొక అపూర్వమైన రికార్డు అని చెప్పొచ్చు. ఇన్ని భాషల్లో ఇప్పటి వరకు ఇతర సినిమాలేవీ విడుదల కాలేదు. మొత్తానికి “అవతార్ 2” టీమ్ ఇప్పటి నుంచే రికార్డుల వేటలో పడింది. ‘అవతార్’ ఫస్ట్ పార్ట్ పండోరలో ముగిసిన విషయం తెల్సిందే. సీక్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ కానుంది. మే 6న విడుదలయ్యే “డాక్టర్ స్ట్రేంజ్‌-2” థియేటర్లలో ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది.

Exit mobile version