NTV Telugu Site icon

Avantika dassani: భాగ్యశ్రీ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ

Avantika Dassani

Avantika Dassani

Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గ‌త వారం జ‌నం ముందుకు వ‌చ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలో అత‌ని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ ద‌ర్శక నిర్మాత‌లు శ్రీకారం చుట్టారు. వినూత్న క‌థాంశంతో ‘అల్లరి’ న‌రేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్నారు నిర్మాత స‌తీష్ వ‌ర్మ. ఆయ‌నే ఇప్పుడు బెల్లంకొండ గ‌ణేష్‌తో ఎస్వీ 2 ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌రుపై రెండో సినిమాను నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా అల‌నాటి అందాల క‌థానాయిక, బాలీవుడ్ భామ భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గ‌తంలోనూ భాగ్యశ్రీ కొన్ని తెలుగు సినిమాల‌లో న‌టించి ఇక్కడి ప్రేక్షకుల మ‌న‌సుల్ని చూర‌గొన్నారు. ‘నేను స్టూడెంట్ సార్’ అనే పేరుతో ఈ సినిమాను రాఖీ ఉప్పల‌పాటి తెర‌కెక్కిస్తున్నారు. దీనికి ద‌ర్శకుడు కృష్ణ చైత‌న్య క‌థ‌ను అందించారు.

Read Also: Organic farming: ప్రకాశ్ రాజ్‌తో సుభాష్ పాలేక‌ర్ బ‌యోపిక్!

ఇటీవలే ఈ చిత్రానికి సంబధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో గణేష్ టెర్రిఫిక్‌గా కనిపించారు. ఈ రోజు అవంతిక దస్సాని క్యారెక్టర్‌ను తెలియ‌చేసే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో అవంతిక.. శృతి వాసుదేవన్ అనే కాలేజీ స్టూడెంట్ పాత్రను పోషిస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లో ఉంది. ఇందులో ఇత‌ర ప్రధాన పాత్రల‌ను శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోదిని, రవి సాయితేజ తదితరులు పోషిస్తున్నారు.

Show comments