అభిరుచి గల దర్శకులు.. కె. ప్రత్యగాత్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు.
ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య వర్మ. అందువల్ల కొందరు కోటయ్య ప్రత్యగాత్మ అనీ పిలిచేవారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1925 అక్టోబర్ 31న ప్రత్యగాత్మ జన్మించారు. బాల్యం నుంచీ అభ్యుదయ భావాలతో సాగారు. కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకొని అండర్ గ్రౌండ్ లోనూ ఉన్నారు. ఆ ఉద్యమంలోనే అన్నపూర్ణ పరిచయం అయ్యారు. వారిద్దరూ పెళ్ళాడారు. కొంతకాలం ‘ఉదయని’ పత్రికలో వ్యాసాలు రాశారు. జర్నలిస్ట్ గానూ పనిచేశారు. మద్రాసు చేరుకుని, అక్కడ తాతినేని ప్రకాశరావు వద్ద కథారచయితగా, అసోసియేట్ గా పనిచేశారు. తొలుత ‘నిరుపేదలు’ చిత్రానికి కథ సమకూర్చారు. ఆ తరువాత ‘ఇల్లరికం’ చిత్రం కూడా ఆయన కథతోనే తెరకెక్కింది. అదే సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశారు. దాంతో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘భార్యాభర్తలు’ చిత్రంతో ప్రత్యగాత్మను దర్శకునిగా పరిచయం చేశారు. ఏయన్నార్, కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ యేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత పతకం గెలుచుకుంది. తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లోనే వరుసగా ఏయన్నార్ తో ‘కులగోత్రాలు’, ‘పునర్జన్మ’ వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. ఈ సంస్థ నిర్మించిన ‘మనుషులు-మమతలు’తోనే జయలలిత తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో ఆమె స్విమ్ షూట్ ధరించడంతో ఆ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగులో తొలి ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రంగా ‘మనుషులు-మమతలు’ నిలచింది.
Also Read
- Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
- KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ 'ఫౌజీ' ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘మంచి మనసు’, ‘దీక్ష’ చిత్రాలకూ కె.ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలలోనూ జమున నాయిక కావడం విశేషం. కృష్ణంరాజును తన ‘చిలకా-గోరింకా’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ప్రత్యగాత్మ. ఇదే సినిమాతో రమాప్రభను నటిగా నిలిపారు. ఏయన్నార్ రజతోత్సవ చిత్రంగా తెరకెక్కిన ‘ఆదర్శకుటుంబం’కు కూడా ప్రత్యగాత్మ దర్శకుడు. విశాఖ పట్నంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా ప్రత్యగాత్మ ‘కులగోత్రాలు’ నిలచింది. ఏ.ఏ.కంబైన్స్ పతాకంపై ఏయన్నార్ సమర్పణలో కృష్ణంరాజు హీరోగా రూపొందిన ‘మంచిమనసు’ కూడా ప్రత్యగాత్మ నిర్దేశకత్వంలోనే రూపొందింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన “అమ్మకోసం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ, ముగ్గురమ్మాయిలు, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, గడుసు అమ్మాయి, కమలమ్మ కమతం” వంటి చిత్రాలు అలరించాయి.
కె.పి.ఆత్మ పేరుతో హిందీలో “దో లడ్కియా, మెహమాన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, బచ్ పన్, తమన్నా, రాజా ఔర్ రంక్, ఛోటా భాయి” వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కొన్ని సిల్వర్ జూబ్లీ చూడడం విశేషం. ప్రముఖ దర్శకనిర్మాత కె.హేమాంబరధర రావు, ప్రత్యగాత్మకు సోదరుడే. ప్రత్యగాత్మ తనయుడు కె.వాసు కూడా దర్శకనిర్మాతగా సాగారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘నాయకుడు -వినాయకుడు’ కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపైనే తెరకెక్కడం విశేషం. ఈ చిత్రం జయలలిత చివరి తెలుగు సినిమా కావడం మరింత విశేషం! తరువాత ప్రత్యగాత్మ సినిమాలకు దూరంగా జరిగారు. 2001 జూన్ 8న ప్రత్యగాత్మ తుదిశ్వాస విడిచారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!