Site icon NTV Telugu

Ashu Reddy : డ్రగ్స్ కేస్ పై స్పందించిన అషు రెడ్డి..అనవసరంగా ఆ విషయంలో నన్ను లాగుతున్నారు అంటూ ఆవేదన…

Whatsapp Image 2023 06 24 At 9.13.30 Am

Whatsapp Image 2023 06 24 At 9.13.30 Am

టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కేస్ కలకలం రేపుతుంది.ఇటీవల ప్రముఖ నిర్మాత అయిన కేపీ చౌదరిని డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుండి కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ అలాగే మరో నటితోనూ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో ఈ కాల్స్ పై అతడు అస్సలు నోరు విప్పలేదు.. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ అందుకునే ఖాతాదారుల్లో ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. కేపీ చౌదరి బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించారు.అతని 11 లావాదేవీలు ఎంతో అనుమానాస్పదంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మరియు గోవాల్లో జరిగిన పార్టీల్లో సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలోనూ పోలీసులు నిర్మాత కేపీ చౌదరిని ప్రశ్నించినట్టు సమాచారం..

సోషల్ మీడియా లో కొందరు బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పేరును కూడా బయటకు లాగారు. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ భామ. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా ఆమె ఖండించారు.. సోషల్  మీడియా లో పేర్కొన్నట్లు తనకు ఎవరితో కూడా ఎలాంటి సంబంధాలు లేవని తనపై వచ్చిన వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలని అషు రెడ్డి తెలిపింది. అవసరమైతే, సమయం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు అస్సలు నిజం ఏంటో వివరిస్తానని స్పష్టం చేసింది.. అలాగే తన ఫోన్ నంబర్‌ను తన అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే.. అస్సలు ఊరుకోను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.తన పై ఇలాంటి నిందలు ఎందుకు వేస్తున్నారో అర్ధం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అషు రెడ్డి.

Exit mobile version