టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ కొద్దిగా బరువుపెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ వినోదాత్మకంగా తెలిపారు. ” అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చ్ 4 వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం” అంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. దీంతో అల్లం అర్జున్ పెళ్లి వాయిదా పడినట్లే. మరి విశ్వక్ సేన్ వివాహం ఎప్పుడు కుదురుతుందో.. ఎప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆశీర్వదిస్తారో చూడాలి.
Ashokavanamlo ArjunaKalyanam: వాయిదా పడ్డ విశ్వక్ సేన్ వివాహం.. కారణం అదేనట

vishwak sen