Ashish Love Me Trailer Released: యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమాకి ‘ఇఫ్ యు డేర్’ అనేది టాగ్ లైన్. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ పరిశీలిస్తే హీరోకి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేయకూడదు అని చెబితే, ఆ పని చేసేవరకూ అతనికి నిద్ర పట్టదు. ఇలాంటి హీరోకి ఒక దెయ్యం గురించి తెలియడంతో అటు వైపు వెళ్లొద్దని అతని సన్నిహితులు చెబుతున్నా వినకుండా ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి తీరాలని నిర్ణయించుకుంటాడు.
Laya: చంపుకోండి.. .పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి లయ షాక్!
హీరో దెయ్యంతో రొమాన్స్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటాడు. ఈ విషయంలో ఎవరు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ముందుకు వెళతాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుంది? అనేది కథ. నిజానికి ఇది కాస్త చిత్రంగా అనిపించినా, కొత్తగా అయితే ఈ పాయింట్ టచ్ చేశారనిపిస్తోంది. ఇక ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశా, మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నా ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.