టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి ప్రగతికి మంచి పేరున్న విషయంతెలిసిందే. స్టార్ హీరోలందరికీ తల్లిగా, పద్దతిగా కనిపించి మెప్పిస్తుంది. అయితే ప్రగతి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె జిమ్ వీడియోలను, హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ తీసిపోను అని రుజువు చేస్తోంది. ఇక తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. టూ పీస్ లెహంగా టైపులో ఉన్న డ్రెస్ లో ప్రగతి క్యాట్ వాక్ చేస్తూ కనిపించింది.
ఇక ఆమె నడుము అందాలను ఎలివేట్ చేస్తూ స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్లు, షేర్లతో వైరల్ గా మార్చేశారు. హా ప్రగతి ఆంటీ.. ఇలా మీరు కూడా హాట్ గా కనిపిస్తే మా కుర్రాళ్ల పరిస్థితి ఏంటీ అని పలువురు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఈ ఏజ్ లో ఇంత గ్లామర్ షో అవసరమా అని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా.. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఒకటే జీవితం .. అనుభవించాలి అంటూ ప్రగతి ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ప్రగతి పలు టాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కనిపించనుంది.