Arnold Vosloo: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతున్న ‘రణబాలి’ (Ranabaali) నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ఆల్-టైమ్ క్లాసిక్ ఫ్రాంచైజ్ ‘ది మమ్మీ’ (The Mummy) సినిమాలో ఐకానిక్ విలన్ ‘ఇమ్‌హోటెప్’ (Imhotep) పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన భారతీయ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్నాల్డ్ వోస్లూ బర్త్ డే సందర్భంగా ‘రణబాలి’ చిత్ర బృందం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇండియన్ సినిమాకు ఆయనను గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతూ ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న క్యారెక్టర్ డీటెయిల్స్‌ను రివీల్ చేసింది.
ఈ సినిమాలో ఆర్నాల్డ్ వోస్లూ అత్యంత క్రూరమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ‘సార్ థియోడర్ హెక్టర్’ (SIR THEODORE HECTOR). అంతేకాదు ఈ పాత్ర తీవ్రతను తెలియజేస్తూ చిత్ర బృందం ఆయనకు ‘ది డెమోన్ ఆఫ్ డ్రాట్’ (The Demon of Drought ) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ఇచ్చింది. హాలీవుడ్‌లో తన నటనతో భయపెట్టిన ఈ స్టార్.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఢీకొట్టే పాత్రలో ఏ రేంజ్ యాక్షన్ పండించబోతున్నారనేది ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ హై-బడ్జెట్ యాక్షన్ డ్రామాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ – టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ విలన్ ఎంట్రీతో ‘రణబాలి’పై అంచనాలు ఒక్కసారిగా స్కై-హైకి చేరాయి.
THE DEMON OF DROUGHT –
SIR THEODORE HECTORFrom captivating audiences across the world as 'Imhotep' in 'The Mummy' to embarking on a new journey as the ruthless 'SIR THEODORE HECTOR' in #Ranabaali ❤️🔥
Happy Birthday and welcome to Indian Cinema, #ArnoldVosloo❤️🔥
-Team… pic.twitter.com/zLtnYUsFdA
— Mythri Movie Makers (@MythriOfficial) June 16, 2026

