Kalyanram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో అలనాటి స్టార్ విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మధ్య సాగిన హుషారెత్తించే పాటను రిలీజ్ చేశారు. ‘చుక్కల చీర చుట్టేసి.. గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే నాయాల్దీ’ అంటూ ఈ సాంగ్ జోష్ ఫుల్ గా సాగుతోంది. ఇందులో ఇద్దరూ హుషారెత్తించే స్టెప్స్ తో ఇరగదీశారు. యూత్ కు నచ్చే విధంగా ఈ సాంగ్ కొరియోగ్రఫీ కనిపిస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రఘురామ్ లిరిక్స్ తో ఈ సాంగ్ కు జోష్ వచ్చింది. నకాష్ అజీజ్ సాంగ్ పాడారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయశాంతి చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. తల్లి, కొడుకు అనుబంధం నేపథ్యంలో సమాజంలో జరుగుతున్న అవినీతిపై వారు పోరాడే తీరును ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయశాంతి నటించడంతో మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది. ఆమె చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపించింది. మళ్లీ ఇందులో నటిస్తోంది. ఈ మూవీని మేలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ టీమ్.