Paramapada Sopanam: ఆసక్తికరంగా ‘పరమపద సోపానం’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పరమపద సోపానం’. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా… పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read :Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ సందర్భంగా ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీవిష్ణు ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘పరమపద సోపానం’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. అర్జున్ అంబటి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు నాగ శివ కూడా నాకు చాలా కాలం నుండి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఆయన కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను.’పరమపద సోపానం’ సినిమాకి పనిచేసిన వారందరికీ నా బెస్ట్ విషెస్” అని చెప్పుకొచ్చారు.
ఇక ‘పరమపద సోపానం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ ఎలిమెంట్ ను కూడా దర్శకుడు నాగ శివ ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు స్పష్టమవుతుంది. హీరో అర్జున్ అంబటి కటౌట్ ని యాక్షన్ ఎపిసోడ్స్ కి వాడిన తీరు, రొమాంటిక్ సన్నివేశాలు, బీచ్ సీక్వెన్స్..లు వంటివి చూస్తుంటే తన గురువు పూరీ జగన్నాథ్ మార్కు ‘మాస్ అండ్ క్లాస్’ శైలిని దర్శకుడు నాగ శివ ఒంటబట్టించుకున్నారని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ‘పరమపద సోపానం’ ఏప్రిల్ 24కి ముస్తభవుతోంది అనే హోప్స్ ని కూడా ట్రైలర్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు