Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ పాట ఇదే కావడం విశేషం. “అరబిక్ కుతు” అత్యంత ఇష్టపడే లిరికల్ వీడియోగా రికార్డును బ్రేక్ చేయడానికి కేవలం 28 రోజులు మాత్రమే పట్టింది. ఈ సమయంలో పాట 173 మిలియన్లకు పైగా వీక్షణలను కొల్లగొట్టింది.
Read Also : The Kashmir Files : నటి, దర్శకుడికి వ్యతిరేకంగా ఫత్వా జారీ…!
అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు నటుడు శివకార్తికేయన్ సాహిత్యం అందించారు. జోనితా గాంధీ, అనిరుధ్ ఈ సెన్సేషనల్ ట్రాక్‌ను పాడారు. సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇక విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
