Rahman: కార్ తీసుకొని స్టూడియోకి వెళ్లేసరికి మూడ్ పోతుంది!

Ar Rahman At Peddi Event

Ar Rahman At Peddi Event

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఒక స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే, ఈ ఇంటర్వ్యూలో స్వయంగా ఆస్కార్ లెజెండ్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. దర్శకుడు బుచ్చిబాబును ముఖాముఖి ఇంటర్వ్యూ చేస్తూ అనేక షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇంటర్వ్యూ ఆరంభంలోనే దర్శకుడు బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. “సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంది.. రెహమాన్ సార్‌కి అసలు తెలుగు వచ్చా? మీ నోటితోనే చెప్పండి సార్” అని అడగడంతో రెహమాన్ గారు ఎంతో స్పష్టమైన తెలుగులో సమాధానమిచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

“నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. 1986 ఆ సమయంలో నేను దాదాపు ఆరేళ్ల పాటు వరుసగా తెలుగు ఇండస్ట్రీలోనే వర్క్ చేశాను. అందుకే స్క్రిప్ట్ లో డైలాగ్స్ చూసి, వాటి మూడ్ ని బట్టి కీబోర్డ్ పై ట్యూన్స్ ప్లే చేయడం నాకు అలవాటుగా మారింది. నా స్టూడియోలో కూడా కేవలం సరదా కోసం మోస్ట్లీ తెలుగులోనే మాట్లాడతాను” అని రెహమాన్ రివీల్ చేశారు. దీనికి కంటిన్యూషన్ గా బుచ్చిబాబు అందుకుంటూ.. “అవును సార్, మీరు స్టూడియోలో జోకులు, కామెడీ కూడా తెలుగులోనే వేస్తారు కదా” అనగానే, రెహమాన్ గారు ఒక్కసారిగా నవ్వుతూ.. “చంపేస్తా.. చంపేస్తాను నిన్ను!” అంటూ ప్యూర్ తెలుగు మాస్ డైలాగ్ కొట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. రెహమాన్ నోట ఈ రేంజ్ మాస్ డైలాగ్ వినడం ఇండస్ట్రీలోనే ఒక రేర్ మూమెంట్ అని చెప్పాలి.

×
×
Ad

కథా చర్చల సమయంలో తనకున్న భయాలను బుచ్చిబాబు ఈ సందర్భంగా పంచుకున్నారు. “సార్, సాధారణంగా ఏఆర్ రెహమాన్ సార్ ని కలవాలంటే మెయిల్స్ లోనే అప్రోచ్ అవ్వాలి, ఆయన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టం అని నన్ను భయపెట్టారు. కానీ నేను కథ చెప్పిన తర్వాత మీరు నాకు పర్సనల్ నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎప్పుడు కాల్ చేసినా.. మీరు ఎంతటి బిజీ మీటింగ్ లో ఉన్నా సరే, కరెక్ట్ గా థర్డ్ లేదా ఫోర్త్ రింగ్ కే ఫోన్ లిఫ్ట్ చేసేవారు. కుదరకపోతే వెంటనే వీడియో కాల్ లో మాట్లాడేవారు. మీ డెడికేషన్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది సార్” అంటూ బుచ్చిబాబు ఆ ఎమోషనల్ జర్నీని గుర్తుచేసుకున్నారు.

బుచ్చిబాబు చెప్పిన మాటలకు ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో క్రియేటివ్ ఆన్సర్ ఇచ్చారు. “మ్యూజిక్ ప్రాసెస్ లో క్రియేటివ్ కనెక్షన్ అలానే స్పాంటేనిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఫలానా సీన్ కి మ్యూజిక్ కాస్త డిఫరెంట్ గా కావాలని అడుగుతారు. నేను సరే అని ఐదు రోజుల తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే, ఆ సీన్ లోని అసలైన ఫీల్ మరియు మొమెంటం పూర్తిగా పోతుంది. అందుకే నా స్టూడియో నా ఇంటి పక్కనే ఉంటుంది. కొన్నిసార్లు అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా అద్భుతమైన ట్యూన్ ఐడియా వస్తుంది. అలా రాగానే వెంటనే స్నానం చేసి, క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టూడియోకి వెళ్లి ఆ ఐడియాని రికార్డ్ చేసేస్తాను. అలా కాకుండా కార్ వేసుకుని ఎక్కడో ఉన్న స్టూడియోకి వెళ్లేలోపు ఆ క్రియేటివ్ మూడ్ కాస్తా ఆవిరైపోతుంది” అని రెహమాన్ వివరించారు.