Site icon NTV Telugu

AR Rahman: అందరి ఊహలని తలకిందులు చేశారు…

Ar Rehman

Ar Rehman

ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కానీ చాలా మంది భారతీయులకి ఆస్కార్ అవార్డ్ గురించి తెలిసేలా చేసిన మొదటి టెక్నిషియన్ ‘ఏఆర్ రెహమాన్’. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించిన రెహమాన్, ఎంతోమంది ఆస్కార్ అవార్డ్ ఇండియన్ కూడా గెలవొచ్చు అని తెలిసేలా చేశాడు. 2009లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిల్లో రెహమాన్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాకి గాను రెహమాన్ ఈ అవార్డుని అందుకున్నాడు. దాదాపు పుష్కరం తర్వాత మరో ఇండియన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్నాడు. జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సూపర్బ్ సాంగ్స్ ఇచ్చిన ‘కీరవాణి’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకున్నాడు. ఒక ఇండియన్ సినిమాకి, ఒక ఇండియన్ టెక్నిషియన్ కి ఇంటర్నేషనల్ వేదికపై అవార్డ్ రావడంతో రెహమన్ ట్వీట్ చేశాడు. “Incredible ..Paradigm shift Congrats Keeravani Garu from all Indians and your fans! Congrats ssrajamouli Garu and the whole RRR team!” అంటూ రెహమాన్ ట్వీట్ చేశాడు.  నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా అవార్డ్ సాదిస్తే, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కొత్త చరిత్ర సృష్టించినట్లే..

Exit mobile version