Site icon NTV Telugu

పవన్ నాయుడు మేమూ చుట్టాలం, నేను సన్నాసి అయితే వాడెవడు..

నిన్న ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరైన ఆయన పలు అంశాలపై మాట్లాడతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లు సినిమాలు నడుస్తున్నాయి. పవన్ గొప్ప వ్యక్తిగా తనకు తాను ఊహించుకుంటూన్నారు. తెలంగాణలో 519 థియేటర్లు ఉంటే 419 సినిమా హాళ్లు మూసి ఉన్నాయని పవన్ తెలుసుకోవాలి. మూడు రోజుల నుంచి ఏపీలోని 510 థియేటర్లలో లవ్ స్టొరీ సినిమా ఆడుతుంది. సినిమా పరిశ్రమను సీఎం జగన్ ఎటువంటి ఇబ్బందులు పెట్టారో చెప్పాలి.

నేను పవన్ ఒకే కులం, నేను సన్నాసి అయితే పవన్ కూడా సన్యాసే. మా వేదవన్నర వేదవ పవన్ ఏమి ఏమి మాట్లాడాడో అర్థం కావడం లేదు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని మధ్యలోకి ఎందుకు లాగావ్. మీడియాను తిట్టే ముందు రోడ్లు సరిగ్గా లేవని కేసియార్ ను ప్రశ్నించు. కేసియర్ పై నోరు తెరవాలి అంటే నువ్వు ప్యాంట్లు తడుపుకుంటావ్. రిపబ్లిక్ ఇండియా అని పవన్ తెలుసుకోవాలి. రిపబ్లిక్ ఇండియా కాబట్టే నువ్వు ఏదైనా మాట్లాడగలుగుతున్నావ్.

నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, తెలంగాణ ముఖ్యమంత్రిని తిట్టు. కోడి కత్తి దాడి కేసుపై ఎన్ఐఏ విచారణ చేస్తుందని పవన్ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే కేంద్ర హోమ్ శాఖ మంత్రిని కలిసి కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించాలి. మేము సంపాదించుకుంటే మీకు పన్నులు,జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదే. మా ఎన్నికల్లో ఓట్ల కోసమే నీ తిప్పలు అని అందరికి తెలుసు’.. అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Exit mobile version