Ap Governement Refuses Bhola Shankar Ticket Price hike: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. షాడో లాంటి డిజాస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా రేట్లు పెంచి అమ్ముకుంటామని సినిమా నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 25 రూపాయల మేర పెంచుకుని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆ అనుమతులు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!
దీంతో ఏపీ ప్రభుత్వం చిరంజీవి మీద విరుచుకుబడింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక రేంజ్ లో ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పెంపు అసాధ్యం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా పెంపు ప్రపోజల్ను ప్రభుత్వం తిరస్కరించిందని ప్రచారం జరుగుతోంది. నిజానికి భోళా టీం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డాక్యుమెంట్లు సమర్పించాలని భోళా శంకర్ టీం కి చెప్పామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిజంగా సినిమా టికెట్ రేటు పెంపుదల ప్రపోజల్ను ప్రభుత్వం తోసిపొచ్చిందా? లేక అది ప్రచారమేనా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద అధికారులు అధికారికంగా ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.