స్టార్ హీరో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి. అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని.. తన కెరీర్‌లో అనేక విభిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రలను పోషించి ఇండస్ట్రీలో మంచి మార్కెట్ సంపాదించుకుంది. అయితే, ‘బాహుబలి’ అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పెద్దగా సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె రాబోయే చిత్రం ‘ఘాటి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె లుక్‌పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.
Also Read :Ravi Raja Pinisetty : అసిస్టెంట్‌గా నా కొడుకుని రామ్ గోపాల్ వర్మ దగ్గరికి పంపి తప్పు చేశా..
ఒకప్పుడు యోగా ట్రైనర్‌గా పనిచేసిన అనుష్క, ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండేది. అరుంధతి, బాహుబలి వంటి చిత్రాల్లో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరించాయి. ‘వేదం’ లో ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ‘సైజ్ జీరో’ మూవీ కోసం ఆమె ఎప్పుడైతే సహజంగా బరువు పెరగిందో, ఆ తర్వాత మళ్లీ తగ్గించుకోవడంలో ఎదురైన ఇబ్బందులు ఆమె కెరీర్‌ను ప్రభావితం చేశాయి. కఠినమైన ఫిట్‌నెస్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పటికీ, మునుపటి శరీరాకృతికి పూర్తిగా తిరిగి రావడం ఆమెకు కష్టమైంది. బాహుబలి తర్వాత ఆమె నటించిన భాగమతి, మిస్ శెట్టి & మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో కూడా, సన్నగా చూపించడానికి CGI ఉపయోగించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ కారణంగా ఆమె..
బహిరంగ కార్యక్రమాల్లో కూడా అరుదుగానే కనిపించింది. బాహుబలి పదో వార్షికోత్సవ వేడుకలకు కూడా ఆమె హాజరు కాలేదు. ఇక ఇప్పుడు, “ఘాటి” ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాల్లో కూడా ఆమెను స్లిమ్‌గా చూపించడానికి CGI వాడినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఈ విషయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నిరాశ చెందగా, మరికొందరు సినిమా విడుదలయ్యాకే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆగస్టు చివర్లో విడుదల కానున్న ఈ చిత్రం, అనుష్క కెరీర్‌లో కొత్త మలుపు తీసుకురాగలదా అన్నది చూడాలి.
