NTV Telugu Site icon

అనుష్క షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై..?

Anushka Sharma

Anushka Sharma

బాలీవుడ్ స్టార్ హీరోయిన్  అనుష్క శర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె నటించవచ్చని, అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విరాట్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి తరువాత అడపాదడపా యాడ్స్ కనిపించిన అనుష్క పాప పుట్టాకా మొత్తం తగ్గించేసింది. అంతకుముందు నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మించే అనుష్క ఇక ఆ బాధ్యత నుంచి కూడా వైదొలగినట్లు పేర్కొని షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ నిర్ణయంతో ఈ భామ అభిమానులకు షాక్ ఇచ్చింది. కుటుంబ బాధ్యతలకు పూర్తిగా అకింతమవ్వడానికి సినిమాలకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ఆమె పేర్కొన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబంకు ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశ్యంతో నిర్మాణ సంస్థ నుండి వైదొలిగా.. అంతే కాకుండా హీరోయిన్ గా కూడా ఇంతకు ముందు చేసినట్లుగా సినిమాలు బిజీ బిజీగా చేయడం లేదు. నా పరిమితి లో తక్కువ సమయం కేటాయిస్తూ సినిమాల్లో నటిస్తాను తప్ప గతంలో మాదిరిగా ఎక్కువ సినిమాలు చేయాలనే ఆసక్తి లేదు అన్నట్లుగా అనుష్క తెలిపిందని సన్నహితులు చెప్తున్నారు.

ఇక ఆమె నిర్ణయాన్ని విరాట్ కూడా అంగీకరించాడట. అనుష్క సినిమాలు చేసినా నాకు ఇష్టమే.. ఇలా ఉన్నా కూడా ఇష్టమే.. ఎందుకంటె ఆమె నిర్ణయం వెనుక ఎన్నో ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నాను అని సర్దిచెప్తున్నాడట. ఇకపోతే అనుష్క నిర్ణయంపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ బాధ్యతలు మోస్తూ  కెరీర్ సెట్ చేసుకోవడం లేదా..? మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్  అని కొందరు.. సరైన ప్లానింగ్ ఉంటే రెండు చోట్ల కూడా ఇబ్బంది లేకుండా అందరిని సంతృప్తి పరచవచ్చు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై అనుష్క మరోసారి ఆలోచిస్తుందేమో చూడాలి.

Show comments