NTV Telugu Site icon

Anushka Sharma: మళ్ళీ తల్లి కాబోతున్న అనుష్క?

Anushka Sharma And Virat Kohli

Anushka Sharma And Virat Kohli

Anushka Sharma Second Pregnancy: అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి ఏ అధికారిక మూలం ధృవీకరించలేదు కానీ చాలా మంది పరిశ్రమ వర్గాలలో ఈ చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా మంది ఇదే విషయం మీద కామెంట్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో వారి రెడ బిడ్డ గురించి ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క – విరాట్ దంపతులకు జనవరి 2021 లో వారి మొదటి బిడ్డ వామికా జన్మించారు. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత, అనుష్క తన రెండవ బిడ్డను ప్రపంచంలోకి స్వాగతించడానికి సిద్ధమవుతోందని చెబుతూ హిందుస్థాన్ టైమ్స్‌లో ఒక వార్తను ప్రచురించారు. అయితే ఆ తర్వాత దాన్ని తొలగించారు. ఇక అనుష్క శర్మకి ప్రస్తుతం మూడవ నెల అని ఆ కథనంలో పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌కు ఆమె తన భర్తతో కలిసి రాలేదని అంటున్నారు.

Ustaad Bhagat Singh: హరీషన్న మాంచి స్పీడు మీదున్నాడే!

ఇక అనుష్క – విరాట్ ఇద్దరూ ఈ వార్తను కూడా మొదటిసారి బిడ్డ విషయంలో ఎలా చేశారో అలాగే గ్రాండ్ ప్రకటన చేయడానికి సరైన సమయం కోసం చూస్తున్నారని అంటున్నారు. కొంతకాలం క్రితం నటి తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ముంబైలోని ఒక ప్రసూతి క్లినిక్‌లో కనిపించినందున అనుష్క శర్మ గర్భం దాల్చిందనే పుకార్లు వస్తున్నాయని అంటున్నారు. ఆ సమయంలో అనుష్క మరియు విరాట్ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని అక్కడి మీడియా వారిని అభ్యర్థించినట్లు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, అనుష్క శర్మ గత కొన్ని రోజులుగా మీడియా లైమ్‌లైట్‌కు కూడా దూరంగా ఉండడంతో ఈ వార్తలకు ఊతం ఇచ్చినట్టు అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే అనుష్క శర్మ ఐదేళ్ల తర్వాత ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆమె భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రలో కనిపించనుంది.