Site icon NTV Telugu

Anurag Kashyap : నెట్ ఫ్లిక్స్ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయదు..

Anurag

Anurag

Anurag Kashyap : స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్ ఫ్లిక్స్ మీద తనకున్న అసహనాన్ని మరోసారి బయటపెట్టారు. తాజాగా యూకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ’అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడారు. ‘అడోలసెన్స్ సిరీస్ అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి వెబ్ సిరీస్ లను మన ఇండియన్ నెట్ ఫ్లిక్స్ అస్సలు ఎంకరేజ్ చేయదు. నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారు.. నెట్ ఫ్లిక్స్ లో పై స్థాయి అధికారులు అంతా అవినీతిపరులే. ఇలాంటి ట్యాలెంట్ ను చూపించే సిరీస్ లను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. ఎంతసేపు వైలెన్స్, కమర్షియల్ వెబ్ సిరీస్, సినిమాలను మాత్రమే ఎంకరేజ్ చేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

read also : Indian Railways: రెండేళ్లలో రైళ్లపై దాడులు.. 7,971 కేసులు.. రూ.5.79 కోట్ల నష్టం

అనురాగ్ కశ్యప్ ఇంతలా ఫైర్ కావడానికి ఓ ప్రధాన కారణం ఉంది. ఆయన 2024లో ‘మాక్సిమం సిటీ’ అనే వెబ్ సిరీస్ ను తీశారు. కానీ దాన్ని నెట్ ఫ్లిక్స్ రద్దు చేసింది. ఈ సిరీస్ ను ‘మ్యాక్సిమం సిటీః బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్’ అనే బుక్ ఆధారంగా తీశారు. ఈ సిరీస్ లో ముంబై సిటీలోని కొన్ని చీకటి కోణాలను, యూత్ అలవాట్లను చూపించారు. కానీ దాన్ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయకుండా రద్దు చేసింది. అప్పుడే అనురాగ్ తన అసహనాన్ని వినిపించాడు. నెట్ ఫ్లిక్స్ మీద తీవ్ర విమర్శలు చేశాడు. ఇప్పుడు తాజాగా యూకే వెబ్ సిరీస్ ను ఉదాహరణగా చూపిస్తూ విరుచుకుపడ్డాడు. ఒకవేళ అలాంటి కంటెంట్ ను నెట్ ఫ్లిక్స్ ఎంకరేజ్ చేయకపోతే యూకేలో ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించాడు. ఇండియన్ నెట్ ఫ్లిక్స్ లో పనిచేసే వాళ్లే సరిగ్గా లేరంటూ ఫైర్ అయ్యాడు.

Exit mobile version