మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో నివసించే అనుపమ షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. “మీ కళ్ళను నమ్మవద్దు, మీ మెదడును నమ్మవద్దు, అప్పుడు… ఏం నమ్మాలి?” అంటూ టీజర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఘంటా సతీష్ బాబు అందించారు. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని చూసుకుంటున్నారు.
Read Also : Prabhas : రికార్డ్స్ బ్రేకింగ్ కాంబో రిపీట్… రివీల్ చేసిన రెబల్ స్టార్