Anupama Parameswaran: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లు అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. నిఖిల్ తో ఇప్పటికే కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకునన్ అనుపమ ఇప్పుడు అదే హీరోతో 18 పేజీస్ లో నటించి మెప్పించింది. నేడు రిలీజయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా తరువాత అనుపమ డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తోందని వార్తలు వచ్చాయి. అనుపమ సైతం టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నట్లు ఇన్ డైరెక్ట్ గా కూడా చెప్పుకొచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుంచి అనుపమ బయటికి వచ్చేసిందని, సిద్ధుతో జరిగిన గొడవలే అందుకు కారణమని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటివరకు ఈ విషయమై అటు సిద్దు కానీ, ఇటు అనుపమ కానీ నోరు మెదిపింది లేదు.
ఇక తాజాగా 18 పేజీస్ ప్రమోషన్స్ లో సైతం అనుపమకు ఇదే ప్రశ్న ఎదురవ్వగా ఆమె సున్నితంగా తిరస్కరించడం పలు అనుమానాలను తావిస్తోంది. ” 18 పేజీస్ గురించి మాత్రమే మాట్లాడండి.. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను.. ” అని చెప్పుకొచ్చింది. దీంతో అసలు సినిమా ప్రస్తావన కూడా తీసుకురానివ్వడం లేదంటే అమ్మడు బాగానే హార్ట్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. మరి అసలు సంగతి ఏంటి అనేది సిద్దు చెప్తేనే తప్ప తెలిసేలా లేదు.