Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన మాజీ ప్రియుడు తనను ఎంతగా వేధించాడో వివరించారు. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి తనను క్రమంగా ఒక మహిళగా, నటిగా, చివరకు తన నెలసరి విషయంలో కూడా సిగ్గుపడేలా చేశాడని ఆమె వెల్లడించారు. రెండేళ్లపాటు సాగిన ఆ బంధంతో తాను ఎంతగానో డిప్రెషన్ అనుభవించానని చెబుతూ అనుపమ భావోద్వేగానికి గురయ్యారు.
ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో అనుపమ తన మాజీ ప్రియుడి గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఆ బంధంలో తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆమె చెప్పారు. తాను నటిగా ఉండటాన్ని, తన కెరీర్‌ను, తన విజయాలను కూడా ఆ వ్యక్తి చిన్నచూపు చూసేవాడని అనుపమ వెల్లడించారు. అంతేకాదు నా ఎమోషన్స్ ను నెలసరితో ముడిపెట్టి హేళన చేసేవాడని చెబుతూ బాధపడ్డారు అనుపమ.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నెలసరి విషయంలో తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన తీరును అనుపమ వివరించారు. అతని తప్పును ప్రశ్నిస్తే త్వరలో పీరియడ్స్ రాబోతున్నందుకే తాను అలా మాట్లాడుతున్నానని చెప్పేవాడని ఆమె ఆరోపించారు. దీంతో తాను చెప్పే మాటలకు విలువ లేదనే భావన క్రమంగా తనలో ఏర్పడిందని అనుపమ తెలిపారు. తన భావోద్వేగాలను అర్థం చేసుకోవాల్సిన వ్యక్తే చివరకు తన స్త్రీత్వం గురించే సిగ్గుపడే స్థితికి తీసుకెళ్లాడాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన దుస్తులు ఎలా ఉండాలి, ఎలాంటి సినిమాలు చేయాలి వంటి విషయాల్లో కూడా ఆ వ్యక్తి తనపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించాడని ఆమె వెల్లడించారు. అతని ఒత్తిడి కారణంగానే కొన్ని సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నానని, ‘పరదా’ ప్రమోషన్ల సమయంలో తనపై వచ్చిన అసభ్యకరమైన కామెంట్లు కూడా తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. ఒక దశలో నన్ను నేను నెమ్మదిగా కోల్పోతున్నాననే భావన కలిగిందని అనుపమ చెప్పడం ఈ అనుభవం ఆమెపై చూపిన ప్రభావాన్ని తెలియజేస్తోంది.
పెళ్లి, కుటుంబం విషయంలో కూడా ఈ అనుభవం తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని అనుపమ వెల్లడించారు. ఒకప్పుడు తాను పెద్ద కుటుంబాన్ని ఊహించుకునేదానినని, ఏకంగా డజను మంది పిల్లలు కావాలని కూడా అనుకునేదానినని చెప్పారు. కానీ ఈ సంబంధంలో ఎదురైన చేదు అనుభవాల తర్వాత ఇప్పుడు పిల్లలు వద్దనే స్థితికి వచ్చానని ఆమె తెలిపారు. ఒక మహిళగా పుట్టినందుకు, తాను సాధించిన విజయాల గురించి కూడా తనకే బాధ కలిగేలా ఆ బంధం తనను ప్రభావితం చేసిందని అనుపమ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యక్తి తనను నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పటికీ, అతని ప్రవర్తన వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని అనుపమ తెలిపారు.
అయితే తాను వెల్లడించిన విషయాల్లో ఎక్కడా మాజీ ప్రియుడి పేరును ఆమె నేరుగా చెప్పలేదు. అయితే అనుపమకు గతంలో నటుడు ధ్రువ్ విక్రమ్‌తో సంబంధం ఉందంటూ, వాళ్ళు బ్రేకప్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్యే ధ్రువ్ విక్రమ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తానే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరూ ‘బైసన్ కాళమాడన్’ సినిమాలో కలిసి నటించారు. గతంలో వీరిద్దరి ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు, అవార్డు వేడుకల్లో కనిపించిన కెమిస్ట్రీ వంటి అంశాలు డేటింగ్ రూమర్లకు కారణమయ్యాయి. అయితే అనుపమ తన తాజా వ్యాఖ్యల్లో తాను ప్రస్తావిస్తున్న వ్యక్తి ధ్రువ్ విక్రమ్ అని ఎక్కడా చెప్పకపోవడం విశేషం.
ఇక సినిమా విషయాలకు వస్తే.. అనుపమ పరమేశ్వరన్ ఇటీవలి కాలంలో విభిన్నమైన లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2026లో ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మరీచిక’, అలాగే తమిళ్ డ్రామా థ్రిల్లర్ ‘లాక్డౌన్’ థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ Amazon Prime Video లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఉమెన్ సెంట్రిక్ డ్రామాగా వచ్చిన ‘పరదా’, హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కింధాపురి’, కోలీవుడ్ చిత్రాలు ‘డ్రాగన్’, ‘బైసన్’ లతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్రేజీ కల్యాణం’, ప్రేరణ అరోరా నిర్మాణంలో వస్తున్న ఒక బాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!