Anupama Parameshwaran : స్టార్ హీరోయిన్ అనుపమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పేరు మీద అనేక తప్పుడు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై విసిగిపోయిన అనుపమ నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఓ 21 ఏళ్ల యువతిపై కేసు పెట్టింది. తమిళనాడుకు చెందిన యువతి అనుపమపై ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతోంది. ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేస్తోంది. 21 ఏళ్ల యువతి, అనుపమ పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి, అనుపమ ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేస్తోంది.
Read Also : Bigg Boss 9 : టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఇలా జరిగిందేంటి..
ఈ విషయాన్ని గమనించిన అనుపమ టీమ్ వెంటనే ఆధారాలు సేకరించి, అధికారులకు అందజేసింది. దీంతో పోలీసులు ఆ యువతిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. అనుపమ మాత్రం ఈ ఘటనపై స్పందిస్తూ “ఇలాంటి ఫేక్ అకౌంట్లను నమ్మొద్దు. నేను ఎప్పుడూ నా అధికారిక అకౌంట్ ద్వారానే అభిమానులతో మాట్లాడుతాను” అని ట్వీట్ చేసింది. ఒక యువతి తనపై ఇలాంటి పోస్టులు పెడుతుందని నమ్మలేకపోయానని.. ఆమె కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని ఆమె వివరాలు తెలియజేయట్లేదని అనుపమ వెల్లడించింది. ఇలాంటి పోస్టులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Read Also : Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
