JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కాదని దగ్గుపాటి చెబుతున్నారు. కానీ ఈ వివాదం మాత్రం ఆగట్లేదు. అటు సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ ను ఎవరూ పెద్దగా ఖండించట్లేదు. ఈ క్రమంలోనే స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతు పలికాడు. తాను జూనియర్ ఎన్టీఆర్ వెంటే ఉంటానని తెలిపారు. ఆయనపై చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నట్టు తెలిపాడు.
Read Also : Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ సూపర్ అంతే..
ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద జరిగిన ఘటన.. రేపు మరో స్టార్ హీరోపై జరగొచ్చు. సినిమా మనల్ని ఒక్కటిగా ఉంచుతుంది. కానీ రాజకీయాలు మనల్ని విడదీస్తాయి. కాబట్టి ఈ టైమ్ లో అందరం జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా ఉండాలి అంటూ రాసుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల నిరసన తెలుపుతున్నారు.
Read Also : Mirai : తేజసజ్జా మిరాయ్ వాయిదా పడుతుందా..?
