Site icon NTV Telugu

‘మహాసముద్రం’లో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఇదే!

Anu Emanuel’s role in Maha Samudram

శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించించిన చిత్రం “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు హీరోయిన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ? అనే విషయం అర్థమే కాలేదు. అయితే తాజాగా ఆమెకు పాత్రకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ న్యాయవాదిగా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

Read Also : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన అదితి రావు హైదరీ

అను చాలా కాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. కెరీర్ మొదటి నుంచీ స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. మంచి హిట్ ఎదురు చూస్తున్న అను ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కన్పించి ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. మరి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అనుకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Exit mobile version