Site icon NTV Telugu

Marvel: ఈ సూపర్ హీరో సినిమాకి హైప్ లేదేంటి?

Ant Man And The Wasp

Ant Man And The Wasp

మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న మార్వెల్ సినిమా మాత్రం బజ్ ఇండియాలో బజ్ ని క్రియేట్ చెయ్యలేకపోతుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” తెరకెక్కింది. 2019లో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ కరోనా కష్టాలు దాటుకోని 2021 నవంబర్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.

ఈ మూవీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5కి గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తుందని వెస్ట్రన్ మార్వెల్ లవర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” ట్రైలర్ లో ‘కాంగ్’ వర్సెస్ ‘యాంట్ – మ్యాన్’ మధ్య ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా చూపించారు. ఆడియన్స్ ని మెప్పించగలిగితే ‘థానోస్’ తర్వాత ఆ రేంజులో ఆకట్టుకున్న విలన్ క్యారెక్టర్ ‘కాంగ్’దే అవుతుంది. అయితే “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ఇండియాలో పెద్దగా బజ్ ని క్రియేట్ చెయ్యలేకపోయింది. యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా సినిమా ఇండియాలో భారి ఎత్తున రిలీజ్ అయితే మంచి కలెక్షన్స్ వస్తాయి కానీ ఎందుకో ఇక్కడ ఈ సూపర్ హీరో సినిమాపై హైప్ లేదు. మార్వెల్ సినిమా ఇంత చప్పగా సౌండ్ లేకుండా రిలీజ్ అవ్వడం అనేది అరుదుగా జరిగే విషయం. మరి ఈ సైలెన్స్ ని కూడా బ్రేక్ చేసి యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా ఇండియాలో మంచి కలెక్షన్స్ ని రాబడుతుందేమో చూడాలి.

Exit mobile version