NTV Telugu Site icon

Anshu Ambani: అయ్యా.. ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..?

Ptrabhas

Ptrabhas

Anshu Ambani: ఇండస్ట్రీలో ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలంటే వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చేసినా.. అది హిట్ అయితే ఎప్పటికి ప్రేక్షకులు ఆ పాత్రను, ఆ పాత్రలో నటించినవారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే గుర్తుండిపోయే పాత్రలో నటించింది అన్షు అంబానీ. అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే జంటగా కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ అన్షు. నాగార్జున ప్లాష్ బ్యాక్ లో అన్షును ప్రేమించడం.. ఆమె చనిపోవడం.. అందువల్లే ఆడవాళ్లకు దూరం కావడం తెల్సిందే. అయితే ప్లాష్ బ్యాక్ లో నటించిన హీరోయిన్ ఎవరో కాదు అన్షు. కనిపించేది కొద్దిసేపే అయినా.. రెండు పాటలకే పరిమితమయిన అమ్మడి అందానికి తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తోంది అని అనగానే.. అభిమానులు కూడా ఆమెను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ సరసన రాఘవేంద్రలో మెరిసింది. అందులో కూడా పరిమితంగానే కనిపించింది. నీ స్టైలే నాకిష్టం.. నీ స్మైలే నా ప్రాణం అంటూ డార్లింగ్ ను ఆ రేంజ్ లో పొగిడేస్తుంటే.. ఫ్యాన్స్ సైతం నువ్వు కూడా మాకిష్టం అని మనస్సులో పదిలంగా దాచుకున్నారు.

Fahadh Faasil: ఎవర్రా ఈ రత్నవేలు.. సోషల్ మీడియా అంతా ఒకటే మోత

ఇక ఈ సినిమా హిట్ కాకపోయినా.. ఆ ఒక్క సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. అలా ఈ రెండు సినిమాలతో అన్షు తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆమెకు హీరోయిన్ గా అవ్వాలని ఆశ ఉండేదట. అయితే అది కేవలం రెండు మూడు సినిమాలు చేస్తే చాలని అనుకున్నదట. ఆ కల నెరవేరడంతో ఎంచక్కా పెళ్లి చేసుకొని భర్తతో లండన్ వెళ్ళిపోయింది. అన్షుకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. లండన్ లో ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్న ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందున్న కళ లేకపోయినా.. కొద్దిగా బక్కచిక్కి అందంగానే కనిపిస్తుంది. అయితే ఆ అన్షు అని గుర్తుపట్టడానికి మాత్రం కొద్దిగా టైమ్ పడుతుంది అనే చెప్పాలి. ఇకపోతే అన్షు.. ముందు ముందు రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Show comments