Site icon NTV Telugu

RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ

rrr

జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్ వారితో పోరాడిన అల్లూరిని, వారితో కలిసి పని చేసే పోలీసు అధికారిగా మేకర్స్ ఎలా చూపిస్తారని కమ్యూనిస్టు నాయకుడు ప్రశ్నించారు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన నిజమైన దేశభక్తుడు అల్లూరి. కానీ మేకర్స్ మాత్రం ఇంకోటి చూపిస్తున్నారని రామకృష్ణ అన్నారు.

Read Also : Mohan Babu and Vishnu : రంగంలోకి దిగిన నాయీ బ్రాహ్మణులు … కేసు నమోదు

రాజమౌళిని గొప్ప దర్శకుడని, కమ్యూనిస్టు నాయకుడు అల్లూరిని తప్పుగా చిత్రీకరించి ఇలాంటి సినిమా నిర్మాత ఎలా తప్పు చేస్తాడని ప్రశ్నించారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా సెన్సార్‌ బోర్డు కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విప్లవకారుల కుటుంబ సభ్యులకు సినిమాను చూపించాలని, వారు ఓకే చెప్పిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు వేర్వేరు టైమ్‌లైన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులపై మేకర్స్ ఎలా సినిమా తీస్తారు ? అనే దానిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో వివాదాలు మొదలయ్యాయి. అల్లూరి 1924లో మరణించారని, కొమరం భీమ్ 1940లో మరణించారని తెలుపుతూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో చరిత్రను తప్పుగా చూపిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక భీమ్ నిజాం రాజుపై పోరాడినప్పుడు ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధరించడాన్ని బీజేపీ తప్పు పట్టింది.

Exit mobile version