Vishwak Sen: ఈ సినిమా హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి, సింగర్ రఘు కుంచె, రచయిత లక్ష్మీభూపాల కార్యక్రమంలో పాల్గొని సినిమా టీమ్ కు విశెస్ తెలియజేశారు. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఇచట అందంగా సినిమాలు తీయబడును అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం. రెట్రో బ్యాక్ డ్రాప్, కెమెరా పనితనం, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. దర్శకుడు చెందూ ఓ పిట్ట కథను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించాడో…ఈ సినిమాను అంతకంటే బాగా తెరకెక్కించాడు. హీరో చైతన్య, హీరోయిన్స్ లావణ్య, మిహిర,ఉత్తర అందరూ స్క్రీన్ మీద ఆకట్టుకునేలా ఉన్నారు. యష్ గారితో కలిసి త్వరలో ఓ సినిమా చేస్తాను. అన్నారు.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ప్రారంభించిన రోజే చెప్పాను ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. ఇప్పుడూ అదే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ గారికి, దర్శకుడు చెందు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశ్వక్ గారికి చిన్న సినిమాల ఇబ్బంది తెలుసు. అందుకే ఆయన వచ్చి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మా సినిమా చూస్తున్నంత సేపు మీ లైఫ్ లోని మెమొరీస్ గుర్తొస్తాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ యు సర్టిఫికెట్ సెన్సార్ నుంచి వచ్చింది. రెండు గంటలు ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. అన్నారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – ఏ సినిమాను చిన్న సినిమా అనొద్దు. కొత్త వాళ్ల సినిమా అని పిలవండి. నేను రావడం వల్ల సినిమాకు మంచి జరిగితే తప్పకుండా ప్రమోషన్ కు వస్తాను. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ నచ్చింది. ఈ సినిమా మీరు ఆశించిన సక్సెస్ అందుకుంటుంది. హీరో చైతన్య ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ కీలా కోడాలో నటిస్తున్నాడు. దర్శకుడు చెందు టాలెంటెడ్ పర్సన్. ఒక ఫ్యామిలీలా ఈ సినిమా కోసం టీమ్ అంతా కష్టపడ్డారు. నిర్మాత యష్ గారు సినిమా కోసం డెడికేషన్ తో ఉంటారు. వీళ్లందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా.
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!