విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “అనబెల్ సేతుపతి”. బహుభాషాగా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గతంలో సూర్య, మోహన్ లాల్ వరుసగా తమిళ, మలయాళ వెర్షన్‌లలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఫుల్ గా హారర్, కామెడీ అంశాలు ఉన్నాయి. 1948 కాలం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు అర్థమవుతుంది. అప్పట్లో రాజా సేతుపతి తన ప్రేయసికి కానుకగా ఓ రాజా భవనాన్ని నిర్మిస్తాడని, తరువాత ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి తాప్సి అండ్ టీం దెయ్యలతో సహజీవనం చేయడం వంటి సన్నివేశాలతో దర్శకుడు నవ్వించే ప్రయత్నం చేశాడు. డైలాగులు కూడా అదిరిపోయాయి. అయితే లాస్ట్ పంచ్ “కొత్త కథలను ఎక్కడ చెబుతున్నారు… చెప్పిందే తిప్పి తిప్పి చెప్తున్నారు” అంటూ యోగిబాబు తాప్సితో చెప్పడం ఆకట్టుకుంటోంది.
Read Also : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్!?
రాజేంద్ర ప్రసాద్ మరియు యోగి బాబులను ఒకే ఫ్రేమ్‌లో చూడటం బాగుంది. జగపతి బాబు, వెన్నెల కిషోర్, రాధిక శరత్‌కుమార్, దేవదర్శిని, సురేఖా వాణి, సురేష్ మీనన్ ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపక్ సుందరరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. “అనబెల్ సేతుపతి” సెప్టెంబర్ 17 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, మలయాళంలో ప్రసారం కానుంది. మొత్తానికి దర్శకుడు ఒక బంగ్లా చుట్టూ కథను నడిపిస్తాడన్న విషయం ట్రైలర్ తో స్పష్టమైంది. ఆ కామెడీ థ్రిల్లర్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.