NTV Telugu Site icon

Hanuman: అంజనాద్రి థీమ్ రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి భయ్యా

Hanu

Hanu

Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.210 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమాలో విజువల్స్.. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హనుమాన్.. రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటుతుంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ఓటిటీలోకి అడుగుపెట్టబోతుంది.

ఇక ఈ నేపథ్యంలోనే సినిమాపై మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలోని అంజనాద్రి థీమ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హనుమంతుడు ఎలా పుట్టాడు దగ్గరనుంచి.. సముద్రంలో హనుమంతుని రక్తం ఎలా వచ్చింది అనేది చూపించారు. ఇక ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పాట‌కు శివశ‌క్తి ద‌త్తా లిరిక్స్ అందించ‌గా.. సాయి చరణ్ భాస్కరుణి ఆలపించారు. గౌరహరి సంగీతం స‌మ‌కుర్చాడు. ఈ సాంగ్ వింటుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి భయ్యా అని కొందరు.. రఘు నందన సాంగ్ కావాలి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఓటిటీలో ఎప్పుడు వస్తుందో చూడాలి.