Site icon NTV Telugu

Anjali : యాక్షన్ స్టార్ విశాల్ నెక్స్ట్ మూవీలో అంజలి సర్‌ప్రైజ్!

Anjali

Anjali

దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనకు పేరుగాంచిన నటి అంజలి. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తన టాలెంట్, ఎమోషనల్ ఎక్సప్రెషన్‌తో త్వరగానే ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ‘ఫోటో’, ‘ప్రేమకవితం’ వంటి సినిమాల తర్వాత, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’, ‘బాలుపు’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి, వెరైటీ రోల్స్‌లో మెప్పిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక తాజాగా..

Also Read: Priyanka Chopra : రంగు వల్ల..కెరీర్ స్ట్రగుల్‌పై ప్రియాంక ఆవేదన

తమిళ యాక్షన్‌ హీరో విశాల్‌ ప్రస్తుతం తన 35వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి ఇటీవలే అధికారికంగా పూజా కార్యక్రమాలు జరిపి సెట్స్‌పైకి వెళ్లింది. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా దుషార విజయన్ ఇప్పటికే ఎంపికవ్వగా, తాజాగా మరో ప్రధాన పాత్ర కోసం హీరోయిన్ అంజలిను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి కథాంశం గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్నారు. అయితే రవి అరసు డైరెక్షన్‌ కాబట్టి యాక్షన్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు కూడా పెద్ద పీట వేస్తారని టాక్. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలోనే రిలీజ్ అవుతాయని టీమ్ చెప్పింది. ఇక విశాల్ ఇటీవల చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దుషార, అంజలి కాంబినేషన్‌తో పాటు రవి అరసు దర్శకత్వం ఈ ప్రాజెక్ట్‌కు హైలైట్‌గా మారనుంది.

Exit mobile version