Anjali : యాక్షన్ స్టార్ విశాల్ నెక్స్ట్ మూవీలో అంజలి సర్‌ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనకు పేరుగాంచిన నటి అంజలి. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తన టాలెంట్, ఎమోషనల్ ఎక్సప్రెషన్‌తో త్వరగానే ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ‘ఫోటో’, ‘ప్రేమకవితం’ వంటి సినిమాల తర్వాత, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’, ‘బాలుపు’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి, వెరైటీ రోల్స్‌లో మెప్పిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక తాజాగా..
Also Read: Priyanka Chopra : రంగు వల్ల..కెరీర్ స్ట్రగుల్‌పై ప్రియాంక ఆవేదన
Also Read
తమిళ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం తన 35వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి ఇటీవలే అధికారికంగా పూజా కార్యక్రమాలు జరిపి సెట్స్‌పైకి వెళ్లింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా దుషార విజయన్ ఇప్పటికే ఎంపికవ్వగా, తాజాగా మరో ప్రధాన పాత్ర కోసం హీరోయిన్ అంజలిను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి కథాంశం గుట్టుచప్పుడు కాకుండా ఉంచుతున్నారు. అయితే రవి అరసు డైరెక్షన్ కాబట్టి యాక్షన్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు కూడా పెద్ద పీట వేస్తారని టాక్. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ త్వరలోనే రిలీజ్ అవుతాయని టీమ్ చెప్పింది. ఇక విశాల్ ఇటీవల చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దుషార, అంజలి కాంబినేషన్‌తో పాటు రవి అరసు దర్శకత్వం ఈ ప్రాజెక్ట్‌కు హైలైట్‌గా మారనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!