Animal: వంగా మామ.. ఇంత మోసం చేస్తావనుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal: అనిమల్.. అనిమల్.. ఏంటి గత ఏడాది మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటపడుతుంటే.. మళ్లీ అనిమల్ ట్రెండ్ అవుతుంది అని చూస్తున్నారు కదా. థియేటర్ లో ఒక్కసారి చూసినందుకే.. సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఫ్యాన్స్.. అదే ఓటిటీ లో వస్తే ఎందుకు వదులుతారు. అందుకే ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. నేటి నుంచి అనిమల్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి అభిమానులు సినిమాపై పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అనిమల్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ సృష్టించి ఇండస్ట్రీని షేక్ చేసింది. దాదాపు నెల తరువాత ఈ సినిమా ఓటిటీకి వచ్చింది.
ఇక ఈ సినిమా రన్ టైమ్ గురించి అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ చూపించారు. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా చేయడంతో అంత టైమ్ ప్రేక్షకులకు పెద్ద డ్రా బ్యాక్ అనిపించలేదు. ఇంకొంతసేపు ఉన్నా పర్లేదు అని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఓటిటీలో థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరికొన్ని సీన్స్ యాడ్ చేసి ఓటిటీలో 3 గంటల 28 నిమిషాల మూవీని రిలీజ్ చేయనున్నట్లు సందీప్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులందరూ.. ఆ కొత్త సీన్స్ కోసం ఎంతగానో ఎదురుచూసారు. కానీ, ఆ ఎదురుచూపులు అలాగే ఉండిపోయాయి. ఎందుకంటే.. ఓటిటీలో కూడా థియేటర్ రన్ టైమ్ తోనే రిలీజ్ చేశారు. ఇక ఇది చూసిన అభిమానులు వంగా మామ.. ఇంత మోసం చేస్తావనుకోలేదు.. అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద... హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
- Romantic Comedy Movie OTT : మసాజ్ సెంటర్ లో మత్తెక్కించే దృశ్యాలు... ఓటీటీలోకి మలయాళ బోల్డ్ రొమాంటిక్ మూవీ
తాజావార్తలు
-
Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్‌లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
-
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..