Site icon NTV Telugu

Animal: అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..

Animal Ranbeer

Animal Ranbeer

Animal Arjan Vailly Song : అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబర్‌ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌లు విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేక‌ర్స్ ఫోర్త్ సింగిల్ ‘అర్జన్ వాయ్లీ’ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట చూస్తుంటే ఈ డికేడ్ మొత్తానికి మోస్ట్ వైలెంట్ సాంగ్‌గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. భూపిందర్ బబ్బల్ ఈ పాటను రాసి అత‌నే పాడగా మనన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఇక సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఈ పాట ఉండబోతున్నట్టు వీడియో చూస్తే తెలుస్తోంది. ‘యానిమల్’ లోని ఈ కొత్త పాట మీకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ 3 నిమిషాల నిడివి గల పాట చాలా అద్భుతమైన రీతిలో చిత్రీకరించబడింది. ఈ చిత్రంలోని ఈ పాట ఇతర పాటల నుండి పూర్తిగా భిన్నంగా ఉంది, ఇందులో రణబీర్ కపూర్ భయానక లుక్ లో కనిపిస్తున్నాడు.

Pawan Kalyan – Mahesh Babu: మహేష్ బాబు కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్..?

పాటలో రౌడీ లుక్‌లో రణబీర్ కపూర్ శత్రువులను చంపుతున్న తీరు చూడాల్సిందే అన్నట్టుంది. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పవర్ ఫుల్ సాంగ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఈ పాటను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ వీడియోపై కామెంట్స్ కూడా వెల్లువెత్తాయి. ఇక ఈ పాటలో హీరో లుక్, పాటకి పెట్టిన టైటిల్ చూసి ఇదేంటి అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..అంటూ కొందరు దర్శకుడిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ఇక అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీలు యానిమల్‌లో ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించనుండగా, రష్మిక మందన్న రణబీర్ ప్రియురాలిగా కనిపించనుంది. కబీర్ సింగ్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’కి దర్శకత్వం వహించగా, ఇది డిసెంబర్ 1 న థియేటర్లలో విడుదలవుతుంది.

Exit mobile version