Site icon NTV Telugu

Animal: యానిమల్ వేట.. రష్మిక బలి అయ్యిందా.. ?

Animal

Animal

Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. గుల్షన్ కుమార్ మరియు టి- సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నే వేరే నువ్వు వేరే అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో లిరికల్ సాంగ్ కాకుండా వీడియో సాంగ్ నే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఈసారి కూడా వీడియో సాంగ్ నే రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి సాంగ్ లో రణబీర్, రష్మిక ప్రేమించుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం చూపించారు.

Love Story: లవర్‌ని పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ యువతి..

ఇక ఈ సాంగ్ లో వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చూపించారు. ఇక అంతా సంతోషంగా ఉన్న సమయంలో రణబీర్ కుటుంబాన్ని వదిలి వెళ్తున్నట్లు చెప్పడంతో.. రష్మిక తన బాధను తెలిపే క్రమంలో వచ్చే సాంగ్ లా కనిపిస్తుంది. రణబీర్ ఒంటినిండా గాయాలతో పూజ చేయడం, రష్మికను వదిలి వెళ్తున్నప్పుడు.. నేను వస్తానో రానో తెలియదు.. కానీ, నువ్వు మాత్రం రెండో పెళ్లి చేసుకోకు అని చెప్పడంతో.. ఈ యానిమల్ వేటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వేటలో యానిమల్ గెలుస్తాడా.. ప్రేమించి పెళ్లి చేసుకొని.. కుటుంబాన్ని వదిలి వచ్చిన రష్మిక బలి అయ్యిందా .. ? లేదా.. ? అనేది తెలియాలి. మొత్తానికి సాంగ్స్ తో కూడా సందీప్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version