NTV Telugu Site icon

Animal: వైలెంట్ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇదేందయ్యా ఇది..

Animal

Animal

Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక విప్లవమే పుట్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మార్చాడు. అక్కడ కూడా సేమ్ సీన్ రీపీట్. ఇక అర్జున్ రెడ్డి నుంచి బయటపడిన సందీప్ ..
అంతకు మించిన వైలెన్స్ ను చూపించడానికి రెడీ అయిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను మొదలుపెట్టాడు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్నిరోజుల నుంచి యానిమల్ రిలీజ్ వాయిదా అంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ఆగస్టు 11వ తేదీన హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.. ఈలోపే ఒక ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.

Prabhudeva: 50 ఏళ్ళ వయస్సులో మూడోసారి తండ్రి అయిన ఇండియన్ మైకేల్ జాక్సన్..?

సందీప్ ముందు నుంచి వైలెంట్ కాదు.. అంతకుమించిన వెలెన్స్ చూపిస్తా అని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే ఈ ప్రీ టీజర్ ను కట్ చేశారు. ఒక హిందీ సాంగ్ తో ఈ ప్రీ టీజర్ మొదలయ్యింది. అస్థిపంజరాలు లాంటి మాస్కులు వేసుకున్న విలన్స్ గుంపులు గుంపులు గా ఒకపక్క వస్తుంటే.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చేతిలో గొడ్డలి పట్టుకొని ఇంకోపక్క రణబీర్ రావడం కనిపిస్తుంది. అసలు ఏ మాత్రం మానవత్వం అనేదే లేకుండా వారందరిని రణబీర్ గొడ్డలితో నరకడం చూపించారు. ఇక ఈ ప్రీ టీజర్ యే ఇంత భయంకరంగా ఉంటే టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. వైలెంట్ అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇదేందయ్యా ఇది.. అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్.. జూన్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సందీప్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Show comments