Animal: అనిమల్ ఫీవర్ ఇంకా ప్రేక్షకులకు తగ్గలేదు.. చెప్పాలంటే.. ఇంకా జమాల్ జమాలో వైబ్ లో నుంచి అస్సలు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అనిమల్ గురించే చర్చ. దాదాపు 18 రోజులు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి.. ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇంకా విజయవంతంగా థియేటర్ లో నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా వైలెంట్ అనిమల్.. బాలీవుడ్ రేంజ్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. ఒక సినిమా ఇంత లెంత్ తో రిలీజ్ అయ్యి.. ఈ రేంజ్ లో హిట్ అందుకోవడం చాలా రేర్ అని చెప్పాలి. రణబీర్ కపూర్ లో అనిమల్ ను సందీప్ వాడినట్లు ఇంకెవరు వాడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఓటిటీలో అనిమల్.. 4 గంటలు స్ట్రీమింగ్ అవుతుందని చెప్పడంతో ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అనిమల్ ఓటిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందన్న విషయం తెల్సిందే. దాదాపు 8 వారాల తరువాత అనిమల్ ఓటిటీలోకి అడుగుపెడుతుంది. అంటే.. సంక్రాంతికి ఏమైనా ప్లాన్ చేయొచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. థియేటర్ లో సెన్సార్ కట్ లేని అనిమల్ కు ఓటిటీలో సెన్సార్ కట్ పడింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లు ఏ రేంజ్ శృంగారం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అన్నిరోజులు ఒకేలా ఉండవు కాబట్టి.. ఈ మధ్యనే ఓటిటీకి కొత్త రూల్స్ వచ్చాయి. సెన్సార్ కట్స్ ఉంటే కచ్చితంగా వాటిని తొలగించడమో.. మ్యూట్ చేయడమో చేయాలి. దీంతో అనిమల్ కు అది చాలా పెద్ద దెబ్బ. ముద్దులు, శృంగార సన్నివేశాలకు కట్ పడుతుంది అని అంటున్నారు. అలా ఉంటే.. అనిమల్ 4 గంటల సినిమా చూడడం కష్టమే అని అభిమానులు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
